*విద్యార్థుల ప్రతిభకు అభినందనలు : వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు…*
……..
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, వెంకటాచలం మండలం, నెల్లూరు, “భారతీయ భాషా దివస్” సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు విజయాన్ని సాధించారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి: పి. ప్రత్యూష (తెలుగు డిపార్టుమెంట్) – ₹5,000/-
రెండవ బహుమతి: పి. షాజిదా భేగం (పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంట్) – ₹3,000/-
మూడవ బహుమతి: పి. జ్యోతి (MBA డిపార్టుమెంట్) – ₹2,000/-
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ, వారి ప్రతిభకు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా, తెలుగు శాఖ కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ ఇంచార్జి హెడ్ డాక్టర్ ఎమ్. త్యాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సి. రాజారామ్, డాక్టర్ టి. విమల, డాక్టర్ కె. లక్ష్మినారాయణ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశ్వర్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.