*విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్-4 బృందానికి ప్రశంస పత్రాన్ని అందజేసిన వెంకటాచలం ఎం.పీ.డీవో*

వెంకటాచలం మండలం, ఎర్రగుంట గ్రామంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం NSS యూనిట్–4 ఆధ్వర్యంలో ఈనెల 8 వ తారీకు నుండి 14 వరకు నిర్వహించిన NSS ప్రత్యేక శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకటాచలం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) శ్రీమతి బి. కల్పన గారు NSS యూనిట్–4‌కు అభినందన పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. బి. వెంకట్ సుబ్బా రెడ్డి గారి నాయకత్వంలో వాలంటీర్లు సామాజిక అభివృద్ధి దిశగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ ప్రజలలో ఆరోగ్య అవగాహన, పర్యావరణ పరిరక్షణ, విద్యా చైతన్యం, పరిశుభ్రత కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై ప్రచారం వంటి అనేక సేవా కార్యక్రమాలు వాలంటీర్లు సమర్థవంతంగా నిర్వహించారు.

గ్రామ అభివృద్ధి పట్ల NSS బృందం చూపిన సేవా మనోభావాన్ని అభినందిస్తూ, కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించినందుకు టీమ్ మొత్తానికి MPDO గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

NSS యూనిట్–4 యొక్క ఈ సేవా కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి దోహదపడడంతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో NSS విద్యార్థులు లింగరాజు , గణేష్, దిలీప్, కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed