*వార్డు సచివాలయ వి.ఆర్.ఓ లు, పట్టణ ప్రణాళిక విభాగం నక్ష ప్రాజెక్ట్ బృందంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ  కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం వార్డు సచివాలయ వి.ఆర్.ఓ లు, పట్టణ ప్రణాళిక విభాగం నక్ష ప్రాజెక్ట్ బృందంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష ప్రాజెక్టు నిర్వహణకు సంబంధిత వార్డు సచివాలయ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అందరూ సహకరించాలని కమిషనర్ ఆదేశించారు.

నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు, దేవస్థానాలు, ప్రధాన మార్గాలు, మేజర్ కాలువలు అన్నింటిని నక్ష ప్రాజెక్టు ద్వారా మ్యాపింగ్ చేయించాలని కమిషనర్ సూచించారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, నక్ష నోడల్ ఆఫీసర్ సతీష్ కుమార్, వార్డు సచివాలయ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు, వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *