*వరద ప్రభావిత గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగాం.
– బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
– లోతట్టు గ్రామాలలో మెరుగైన డ్రైనేజ్ సదుపాయాలు కల్పిస్తాం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కష్టకాలంలో ప్రజలకు అండగా వుండాలన్న లక్ష్యంతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. విడవలూరు మండలం గాదెల దిన్న గ్రామానికి వెళ్లిన ఆమె గ్రామస్థుల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో మెరుగైన డ్రైనేజ్ వసతులు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హామీ యిచ్చారు. మొంధా తుఫాను సందర్భంగా భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులతో కలిసి గ్రామాలలో సహాయక చర్యలు పర్వేక్షించిన నాయకులను ఆమె ప్రశంసించారు. ఇదే స్పూర్తితో ప్రజలతో మమేకం అయి పని చేయాలని ఆమె నాయకులకు మరియు కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే మొంధా తుఫాను భీభత్సాన్ని నివారించ గలిగామన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గ్రామస్థులకు హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ వెంకటేశ్వర్లు రెడ్డి, తహసీల్దారు చంద్రశేఖర్, ఎంపీడీఓ నగేష్ కుమారి, జెడ్పిటిసి లక్ష్మయ్య, సర్పంచ్ శేషయ్య, విడవలూరు టిడిపి మండల అధ్యక్షలు ఏటూరు శ్రీహరి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు దిలీప్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *