
*వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న మెట్లు ,ర్యాంపుల నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీరు డ్రైను కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు నిర్వహిస్తున్న గ్యాంగ్ వర్క్ పనులను శుక్రవారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న మెట్లు, ర్యాంపుల నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.