*రోడ్లపై సంచరిస్తున్న 22 వీధి శునకాలను పట్టుకొని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఏబీసీ సెంటర్ కు సోమవారం తరలించిన మున్సిపల్ సిబ్బంది*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో రోడ్లపై సంచరిస్తున్న 22 వీధి శునకాలను పట్టుకొని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఏబీసీ సెంటర్ కు సోమవారం తరలించారు.

అదేవిధంగా పశువులను వాటి యజమానులు తమ సంరక్షణలోనే ఉంచుకోవాలని, రోడ్లపై సంచరిస్తే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్ తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *