
*రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడకుండా అన్ని డివిజన్లలో సంబంధిత విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్న కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు గురువారం వివిధ ప్రాంతాలలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
అందులో భాగంగా స్థానిక 47, 48 డివిజన్లు మనుమసిద్ధి నగర్, మన్సూర్ నగర్ ప్రాంతాలలో రోడ్లపై చేరిన వరదనీరు డ్రైన్ కాలువల ద్వారా ప్రవహించేందుకు వీలుగా అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించి పనులను పర్యవేక్షించారు.
రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడకుండా అన్ని డివిజన్లలో సంబంధిత విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు జకీర్, ఇంతియాజ్ పాల్గొన్నార