
*రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A) కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయం… నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో .ఆర్.పి.ఐ జిల్లా అధ్యక్షులు ఎస్.కే.మాబు*
జిల్లా కార్యవర్గ సమావేశం .ఆర్.పి.ఐ. ….. ఈరోజు ఆర్పిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం గాంధీ బొమ్మ లస్సి సెంటర్ జిల్లా కార్యాలయం నందు నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా విభజన విషయంలో జిల్లాకు జరిగే అన్యాయం పై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు, నెల్లూరు జిల్లాలో దళితులు ముస్లింలు ఆదివాసీల మీద రాజకీయంగా సామాజికంగా వివక్ష చూపుతున్న ఆధిపత్య అహంకార ధోరణి ప్రదర్శిస్తున్న వారిపై పోరాటాలు, నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీలపై పోరాటం, అలాగే నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం లో ఓటు హక్కు అవగాహన ఓటు నమోదు కార్యక్రమం, నెల్లూరు నగరంలోని అధిక ట్రాఫిక్ మరియు బైక్స్ ఆటోల మీద అధిక చలానాలు విధిస్తున్న జిల్లా అధికారులతో చర్చలు, జిల్లాలో ఆర్.పి.ఇ. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము ముమ్మరంగా చేయడం వంటి కార్యక్రమాలపై తీర్మానాలు చేసుకున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షులు చిట్టేటి శ్రీనివాసులు, ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు ప్రమీల, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ ఆర్థిక బేగం, రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరికొండ సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్, దుంపల సుబ్బారావు, ఆర్ వై ఎఫ్ ఐ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులు ముసలి జయరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి ప్రకాష్, వల్లం నాగసందీప్ తదితరులు పాల్గొన్నారు