*రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి..రాయలసీమ ద్రోహులు వైసీపీ నేతలు..రాయలసీమను దోచుకున్నది వైసీపీ*

*సొంత జిల్లాలో స్టీలు ప్లాంటు కట్టలేనోళ్లు రాయలసీమను ఉద్దరించారా*

*టీడీపీ హయాంలో కట్టిన కండలేరు డ్యాం వద్దకు వైసీపీ నేతలు ఏం చేయడానికి వచ్చారో*

*మా నాయకుల గురించి మాట్లాడే అర్హతే వైసీపీ నేతలకు లేదు*

*కండలేరు డ్యాం వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చిన అనంతరం మీడియాతో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్*

2014-19 మధ్యలో టీడీపీకి రాయలసీమలో తక్కువ సీట్లు వచ్చినా ఇరిగేషన్ పరంగా అత్యధికంగా నిధులు కేటాయించారు

వ్యవసాయ శాఖ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కేటాయింపులోనూ రాయలసీమ జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు

ఆ ఐదేళ్ల కాలంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ హయాంలో పులివెందుల పులి ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే

రూ.12,400 కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అయితే, కేవలం 2 వేల కోట్లు ఖర్చుపెట్టిన పులివెందుల పులి మాత్రం రాయలసీమకు ముద్దుబిడ్డ అయ్యాడా

చంద్రబాబు నాయుడు హయాంలో రాయలసీమ ప్రాంతంలో చేపట్టిన 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేయడంతో పాటు మళ్లీ ఐదేళ్ల పాటు ఎవరూ పునరుద్ధరించకూడదని ఉత్తర్వులు ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి

సొంత జిల్లాలో ఒక్క టీఎంసీ నీటిని ఇవ్వలేని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు

హంద్రీనీవా, గాలేరు నగరి, గండి కోటతో పాటు ఏ ప్రాజెక్టు చూసినా అన్నీ టీడీపీ హయాంలో చేపట్టినవే

రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్లకు పైగా పదవుల్లో ఉన్నా సొంతూళ్లకు నీళ్లు ఇవ్వలేకపోయారు

2017-18లో టీడీపీ కడప జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారు

మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లు అందిస్తున్నాం

కొత్తగా గూడూరు నియోజకవర్గంపై ప్రేమ పెంచుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా కాకాణి, నేదురుమల్లి తదితరులతో కలిసి మొన్న ఇక్కడకు వచ్చినట్టున్నారు

అసలు కండలేరు డ్యాం వద్దకు వచ్చే ముందు గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రసన్నకుమార్ రెడ్డికి గుర్తున్నాయా

గూడూరు డివిజన్ కు తెలుగుగంగ నీటి కేటాయింపుల విషయంలో పోరాడిన శ్రీనివాసులు రెడ్డిని గురించి రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన దారుణమైన వ్యాఖ్యలను మేం మరిచిపోలేం

టీడీపీ హయాంలో కట్టిన డ్యాం మీదకు వైసీపీ నేతలు ఏం చేయాలని వచ్చారో

2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినా అప్పటి మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు తదితరుల సహకారంతో పెండింగ్ లో ఉన్న అటవీ అనుమతులు తెచ్చి అదనపు ఆయకట్టు సాగులోకి తెచ్చారు

ఐదేళ్లు అధికారం అనుభవించి, రైతుల కోసం ఒక్క మంచి పనిచేయని వైసీపీ నేతలు డ్యాం వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడిని తిడతారా

వైసీపీ నేతలకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది

నిన్న నెల్లూరులో ఒకవైపు మిథున్ రెడ్డిని, మరోవైపు మేడా రఘునాథరెడ్డిని పెట్టుకుని కాకాణి, అనిల్ మీడియాతో మాట్లాడారు

ఒకరేమో డ్యాం కొట్టుకుపోవడంతో పాటు 39 మంది చనిపోవడానికి కారణమైన పెద్దమనిషి..మరొకరేమో రాయలసీమ లిప్ట్ పేరుతో రూ.900 కోట్లు కొట్టేసిన గొప్ప వ్యక్తి

ఆ ఇద్దరిని పెట్టుకుని ఈ ఇద్దరు టీడీపీని, చంద్రబాబు నాయుడిని విమర్శించడం విడ్డూరంగా ఉంది

నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పుకోవడానికి అసలు సిగ్గుందా

2014లో మేం అధికారంలోకి వచ్చేనాటికి కనీసం పునాదులైనా ఉన్నాయా

అప్పట్లో సోమిరెడ్డి ఎమ్మెల్యే కాదు..రామనారాయణ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు.. మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పాతరేట్లతో రెండు బ్యారేజీలను 90 శాతం పూర్తయ్యేందుకు కృషి చేశారు

వైసీపీ అధికారంలోకి వచ్చాక విగ్రహాలు పెట్టుకుని ఆ బ్యారేజీలను ఓపెన్ చేసుకుని నిన్న నోటికొచ్చినట్లు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది

మూడేళ్లు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన అనిల్ కు తన ఘనతగా చెప్పుకునేందుకు ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా

ఆ తర్వాత మంత్రిగా వ్యవహరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక్క పనైనా చేశారా

ఇద్దరు రాయలసీమ ద్రోహులను పక్కన పెట్టుకుని మా సీఎం, మంత్రులను విమర్శించడం హాస్యాస్పదం

రాయలసీమ ద్రోహుల్లో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి…రాయలసీమకు ఫలానా ప్రాజెక్టు తెచ్చానని ఆయన చెప్పగలడా

సొంత జిల్లా కడపలో తండ్రి ఒకసారి స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు..కుమారుడు మరోసారి శంకుస్థాపన చేశారు

ఒకటికి రెండు సార్లు శంకుస్థాపన చేసి సొంత జిల్లాలో స్టీల్ ప్లాంటు కట్టలేనోళ్లు రాయలసీమను ఉద్దరించారంట..మా నాయకులు మాత్రం ద్రోహులంట

*కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ, ఏపీ కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నేత ఎస్ఎస్ఆర్ నాయుడు, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, గునుకుల కిషోర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed