
*రాయలసీమను అభివృద్ధి చేసింది, భవిష్యత్ లో చేయనున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.*
*”మిషన్ రాయలసీమ” తో ఈ ప్రాంతాలను రతనాలసీమ గా మార్చేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.*
*రాయలసీమ అభివృద్ధిపై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలను, విషప్రచారాలను తిప్పికొట్టండి.*
*”సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ ” బహిరంగ సభకు కోడుమూరు నియోజకవరం నుండి పెద్ద ఎత్తున తరలిరండి.*
*- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి.*ప్రస్తుతం
కర్నూలు పట్టణంలో NVR కళ్యాణ మండపం నందు కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య నేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కేడిసిసి బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు రామలింగారెడ్డి కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోన్ 5 ఇంచార్జ్ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.
జిఎస్టీ సంస్కరణలు చేపట్టాక ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న తొలి బహిరంగసభ ఈ నెల 16న కర్నూలులో జరగనుంది.
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ శంఖుస్థాపనను ప్రధాని మోదీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించనున్నారు.
20 ఏళ్లపాటు రాష్ట్రంలో పాలన సాగించిన కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాలు రాయలసీమకు చేసింది ఏమీలేదు.
రాయలసీమకు త్రాగు, సాగునీరు ఇచ్చింది నాడు అన్న ఎన్.టి.ఆర్., నేడు చంద్రబాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.
రాయలసీమకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తెచ్చింది… విద్యుత్, త్రాగు, సాగునీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.
రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు, పారిశ్రామిక హబ్ గా తీర్చి దిద్దేందుకు నారాలోకేష్ గారు సంకల్పించి “మిషన్ రాయలసీమ” కు శ్రీకారం చుట్టారు.
నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణలతో రాయలసీమలో వైస్సార్సీపీ తుడుచు పెట్టుకుని పోతుందని భయాందోళనకు గురై, కుట్ర పూరిత రాజకీయాలకు, విషపూరిత ప్రచారాలకు వైసీపీ నేతలు తెగబడుతున్నారు.
రాయలసీమలో టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల, వైస్సార్సీపీ దుష్ప్రచారాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులదే.
విష్ణువర్థన్ రెడ్డి గారు, శాసన సభ్యులు దస్తగిరి గారి సారథ్యంలో కోడుమూరు నియోజకవర్గం నుండి ప్రజలు, వినియోగదారులు, వర్తకులు పెద్ద ఎత్తున “సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ ” బహిరంగసభ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.