*యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచిన కృష్ణ చైతన్య పీజీ కళాశాల కెమిస్ట్రీ విద్యార్థులు..*
————————————–
నెల్లూరు కృష్ణ చైతన్య పీజీ కళాశాలలో పీజీ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి, పర్వత రెడ్డి రానా ప్రమోద్ రెడ్డి అభినందించారు. విద్యార్థులు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకుల సేవలను వారు కొనియాడారు.

*ఈ సందర్భంగా డైరెక్టర్లు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి, పర్వత రెడ్డి రానా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ*

విక్రమ సింహపురి యూనివర్సిటీ విడుదల చేసిన పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో కృష్ణ చైతన్య పిజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థాయిలో నిలవడం ఎంతో సంతోషకరమన్నారు.పిజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫలితాలలో కె. జ్ఞాన దీపిక 90 శాతం మార్కులు సాదించి యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా , అలాగే వి. శ్రావణి 87 శాతం మార్కులతో యూనివర్సిటీ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడానికి గల కారణం తమ కళాశాలలో నిర్వహిస్తున్న, క్లాస్ రూమ్ సెమినార్స్, అకాడమిక్ షెడ్యూల్, గెస్ట్ లెక్చరర్స్ టీచింగ్ దోహదపడుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ జ్యోతి,అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *