
*యూనిటీ మార్చ్‌లో పాల్గొని విజయవంతం చేయండి*
– ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపు
ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న నెల్లూరులో జరిగే యూనిటీ మార్చ్ పాదయాత్రలో యువత, వివిధ రంగాల నిపుణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం జాతీయ సమైక్యతా నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి అని తెలిపారు. ఆయన అసాధారణ కృషి, వారసత్వాన్ని గౌరవిస్తూ, కేంద్ర యువజన వ్యవహారాలు, మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సర్దార్@150” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని చెప్పారు.
ఏక్తా దివస్ సందర్భంగా అక్టోబర్ 31న ఉదయం Sardar@150Unity March అనే పేరుతో మై భారత్ నెల్లూరు, ఎన్ ఎస్ ఎస్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని విఆర్‌సీ మైదానం నుంచి వేదాయపాలెం వరకు నిర్వహించే 5 కిలోమీటర్ల పాదయాత్రను జయప్రదం చేయాలన్నారు. దేశ సమైక్యతలో పౌరులను వికసిత్ & ఆత్మనిర్భర్ భారత్ వైపు నడిపించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గౌరవించడం ఈ పాదయాత్ర ఉద్దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వం కాపాడుకోవడంతో పాటు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులవ్వాలన్నారు.