
*SPS నెల్లూరు జిల్లా*
*ముతుకూరు పరిధిలోని హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, 2,000/- జరిమానా*
*జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. సూచనల మేరకు, గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ముద్దాయిలకి కఠిన శిక్షలు పడేలా చేస్తున్న నెల్లూరు పోలీసులు.*
• 24.04.2022 న ముత్తుకూరు మండలం పరిధిలో, ముద్దాయి, తన అన్నను ఆస్తి విషయంలో గోడవ పడి అతనిని తల మీద కొట్టి,ఇంటిని కాల్చి, అతి కిరాతకంగా ముద్దాయి చంపినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు స్టేషన్ నందు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడమైనది.
• తగిన సాక్ష్యాలను పొందుబరచగా ప్రాసిక్యూషన్ వారు నేరం రుజువుచేయడంతో నేడు నెల్లూరు 3rd ADJ కోర్టు వారు ముద్దాయికి జీవిత ఖైదు జైలు శిక్ష మరియు 2,000/-జరిమానా విధించడం జరిగింది. ఈ కేసును అప్పటి K. P. Port సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. వేమా రెడ్డి గారు దర్యాప్తు చేసి చార్జి షీటు దాఖలు చేసి సాక్ష్యాలను పొందుపరిచినారు.
• కేసు వివరాలు: 76/2022 u/s 324,436,302 IPC altered from 307 IPC of ముతుకూరు పోలీసు స్టేషన్.
• మృతుని వివరాలు: పాముల.సుబ్రమణ్యం s/o late సుబ్రమణ్యం,A/39yrs, మాల, రోయలపాలెం గ్రామం, ముత్తుకూరు మండలం, నెల్లూరు
• ముద్దాయి పేరు (శిక్ష పడిన వారు): పాముల శినయ్య s/o late సుబ్రమణ్యం, వయసు 30 సంవత్సరాలు మాల కులం రోయలపాలెం గ్రామం , ముత్తుకూరు మండలంలో ఉంటున్నారు.
• సదరు కేసును నెల్లూరు 3rd ADJ కోర్టు వారు ముద్దాయికి జీవిత ఖైదు జైలు శిక్ష మరియు 2,000/- జరిమానా విధించడం జరిగింది.
• పై కేసును వాదించడంలో ప్రతిభ కనబరిచిన Additional PP శ్రీ M. చెంచు క్రిష్ణ గారిని, కేసు విచారణ సాక్ష్యాలను పొందుపరచడంలో ప్రతిభ కనబరిచిన విచారణ అధికారి K. P. Port సర్కిల్ ఇన్స్పెక్టర్ K. వేమా రెడ్డి గారిని, కోర్ట్ మానిటరింగ్ SI K.సుమన్ గారిని మరియు లైసెన్ ఆఫీసర్ PC 2406 R.వేణుగోపాల్ గారిని, KP పోర్టు కోర్టు PC-177 M రమేష్ లను జిల్లా SP గారు అభినందించారు
• *ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన నెల్లూరు జిల్లా యస్.పి. గారు.*
• బాధితులకు, ఫిర్యాదుదారులకు ఖచ్చితమైన న్యాయం జరిగేలా సాక్ష్యాధారాలను సేకరించి, నేర నిరూపణ చేస్తున్న జిల్లా పోలీసులు.
• జిల్లా పోలీసుల విశేష కృషి వల్ల ఇప్పటికే చాలా కేసులలో నేరస్థులకు శిక్షలు పడుతున్న వైనం.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.17.11.2025.