
*ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేపట్టిన చారిత్రకదినమే కాదు…దేశ రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికిన జనవరి 9.*
*తెలుగుజాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభంజనమై ప్రభుత్వం ఏర్పాటైన సుభదినం.*
నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ , ఆనం వెంకటరమణ రెడ్డి,చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , బొమ్మిసురేంద్ర ,పనబాక భూలక్ష్మి ,పీఎల్ రావు, కప్పిర శ్రీనివాసులు , దర్శి హరి, హరిబాబు, రాఘవరెడ్డి లతో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
*- బీద రవిచంద్ర MLC, టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు.*
1983 సం., జనవరి 9 న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం నెలకొల్పి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమూల మార్పులకు, ఆనాటి దేశ రాజకీయాలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
సాధారణ కుటుంబాలకు, రాజకీయ నేపథ్యం లేని సామాన్యులకు , ఉన్నత విద్యావంతులకు ఎమ్మెల్యే లు, ఎంపీ లు, జెడ్పీ ఛైర్మన్ లుగా అవకాశం కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ నేతృత్వంలోని నాటి నేషనల్ ఫ్రంట్ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పింది. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.
కేంద్రంలోని ఆనాటి నేషనల్ ఫ్రంట్ అయినా…. తదనంతరం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వాల ఏర్పాటులో అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు నడిపిన ఎన్టీఆర్, చంద్రబాబులే చక్రం తిప్పారు.
కిలో 2/- బియ్యం, పింఛన్లు, పక్కా గృహాలు,ఆడపడుచులకు సమాన ఆస్తి హక్కు, మహిళా విశ్వవిద్యాలయాలు, ఎస్సీ కమీషన్, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు… ఏర్పాటు చేసి సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆదుకున్న ఘనుడు ఎన్టీఆర్.
1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటివరకు….43 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచారు, అదేబాటలో ప్రస్తుతం నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు ల నాయకత్వానికి కొనసాగింపుగా నేడు నారా లోకేష్ ఎన్డీఏ కూటమిని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు.
*2026, మే 28 మహానాడు లోపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.*
*2027, మే 28 మహానాడు లోపు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.*
జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో చర్చించి , పార్టీ పెద్దల సూచనలతో జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నాం.
విగ్రహ ఏర్పాటు కోరుతూ చెన్నైలోని ఎన్టీఆర్ అభిమానులు, స్థానికుల నుండి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి.
చెన్నై లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బీద మస్తాన్ రావు గారితో చర్చిస్తున్నాం.
*ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, భావితరాల భవిష్యత్తు నిర్మించేందుకు నారా లోకేష్ నాడు చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రభంజనం సృష్టించింది, రాష్ట్ర భవిష్యత్తును మార్చివేసింది.*
*రాష్ట్ర నలుదిశలా 226 రోజుల పాటు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా సాగిన యువగళం పాదయాత్రకు జనవరి 27తో మూడేళ్లు పూర్తి కానున్నాయి.*
*ప్రభుత్వ విద్య పటిష్టత, బలోపేతం కోసం నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్యారంగ ప్రక్షాళనతో పాటు చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.*
*బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు శ్రమిస్తున్న నారా లోకేష్ కు బాసటగా… జనవరి 27 న జిల్లా వ్యాప్తంగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నాం.*
యువగళం పాదయాత్ర ప్రారంభ సమయానికి రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఎటు చూసినా అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, ప్రభుత్వ అసమర్థతతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
యువగళం పాదయాత్రతో అన్ని వర్గాల ప్రజల ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను సమన్వయం చేసుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు నారా లోకేష్.
సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును ఉన్నత విద్యతోనే మార్చగలమని భావించి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో విద్యాశాఖను చేపట్టారు నారా లోకేష్.
విద్యారంగ బలోపేతానికి నారా లోకేష్ చేస్తున్న కృషిని స్పూర్తిగా తీసుకుని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంకు శ్రీకారం చుట్టనున్నాం.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులతో, పార్టీ నేతలతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తున్నాం.
కావలిలో 3132 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వేమిరెడ్డి దంపతుల సహకారంతో కోవూరులో, ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆత్మకూరులో సైకిళ్ల పంపిణీ చేయనున్నాం.
సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు లో పాశం సునీల్, వెంకటగిరి లో కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ, గంగాప్రసాద్ లను సమన్వయం చేసుకుంటున్నాం.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 226 ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ స్కూల్స్ మొదలుకుని డిగ్రీ కళాశాలల వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధుల, పార్టీ నేతల సహకారంతో ప్రణాళికలను సిద్ధం చేయనున్నాం.
నారా లోకేష్ కు మద్దతుగా నిలుస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో కంప్యూటర్ సెంటర్స్, ల్యాబ్స్, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కిట్స్, ఇతర మౌళిక సదుపాయాలను అందించనున్నాం.
విద్యారంగం అభివృద్ధికి నారా లోకేష్ పడుతున్న తపనకు బాసటగా నిలుస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,ప్రణాళికలను జనవరి 23 న ప్రకటిస్తాం.