
*మిడతల రమేష్ ను అభినందించిన బిజెపి నేతలు* సురేష్ రెడ్డి. వంశధార్ రెడ్డి*
విభజింపబడిన మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగేటట్లు బిజెపి ప్రతినిధిగా ఉద్యమించి ఫలితం పొందినందుకు బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి లు మిడతల రమేష్ ను ఆత్మకూరు బస్టాండ్ వద్ద అభినందించారు.
ప్రి గెజిట్ నోటిఫికేషన్ లో రాపూరు కలువై సైదాపురం మండలాల విభజన తో ఉత్పన్నమయ్య సమస్యలను నష్టాలను ప్రజల కష్టాలను సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినందుకు అభినందిస్తున్నట్లు సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ విభజన ఉద్యమంలో
బిజెపి ముందడుగులో ఉండి ఆందోళన చేసినందున గూడూరు నెల్లూరు జిల్లాలో కలవడం జరిగిందన్నారు. బిజెపి కార్యకర్తలు జేఏసీతో కలిసి ఆందోళన చేశారు. జేఏసీతో బాటు బిజెపి కార్యకర్తలు ప్రత్యక్షంగా ముందుండి ఆందోళన చేయడంతో ఫలితం దక్కిందన్నారు..
వాకాడు చిట్టమూరు మండలాలు ను నెల్లూరు జిల్లాలో కలిపితే బాగుండేదన్నరు ఇప్పటికైనా ప్రభుత్వం వాకాడు చిట్టమూరు మండలాల విషయం పునరాలోచన చేయాలని వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు..