*మాతృ సంస్థ ఏబీవీపీని జీవితాంతం మరచిపోలేను – బిజెపి ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్*

నెల్లూరు నగరంలోని సోమశేఖరపురంలో ఉన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జిల్లా కార్యాలయంలో పూర్వ ఏబీవీపీ నాయకుడు ప్రస్తుత బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ముక్కు రాధాకృష్ణ గౌడ్ ను ఏబివిపి జిల్లా, రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో ఏబీవీపీ *జ్ఞానం, శీలం, ఏకత* అనే నినాదానికి ఆకర్షితుడై తాను వాటికి కట్టుబడి ఉండడమే కాకుండా 16 సంవత్సరాలు పాటు అలుపెరగని ఉద్యమాలు, పోరాటాలు చేశానని వందలాది మంది విద్యార్థులను నాయకులుగా తయారుచేసే కర్మాగారంలా పనిచేశానని, తన పని తీరును గుర్తించిన జిల్లా వాసులు ఏబివీపీ రాధాకృష్ణ అని పిలుచుకునే వారని నేటికీ తనని అలానే గుర్తించడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఏబీవీపీలో సాధారణ కార్యకర్తగా తాను ప్రారంభమై విడవలూరు బాగ్ ప్రముఖ గాను, నెల్లూరు రూరల్ బాగ్ ప్రముఖ గాను, నెల్లూరు నగర కార్యదర్శి గాను, జిల్లా కన్వీనర్ గాను, కడప, నెల్లూరు జిల్లాల ఇన్చార్జి గాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మూడుసార్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గాను పనిచేయడం జరిగిందని తెలిపారు.

ఆనాడు గోడ రాతలు, వాల్ పోస్టర్లపై రాసి వాటిని గోడలకి అతికించడం, గుడ్డ బానర్ల పైన రాసి కట్టడం వంటి కార్యక్రమాలను ఎప్పటికీ మర్చిపోలేనని పాటలు రాయడం, పాడడం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం తద్వారా విద్యార్థి యువతను పెద్ద ఎత్తున ఏబీవీపీ లోకి చేర్పించానని, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావాలు అక్కడే నేర్చుకున్నానని ఈ సిద్ధాంతం కోసం విద్యార్థి లోకం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలలో భాగంగా పోలీసుల లాఠీ దెబ్బలు రుచి చూశానని జైలు జీవితం అనుభవించాలని లక్షలాదిమంది విద్యార్థులకు ఏబీవీపీ గురించి వివరించి వేలాదిగా సభ్యత్వాలు చేర్చే వాడినని అందులో అనేకసార్లు నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపానని, ఉద్యమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా వేలాదిమంది విద్యార్థులతో రక్తదానం చేయించానని శ్రమా నుభవ శిబిరాల ద్వారా అనేక గ్రామాలకు రోడ్లు వేశామని ఇంకా వినూత్న కార్యక్రమాలను జిల్లా రాష్ట్ర ప్రజలకు చూపానన్నారు. వివిధ ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ కు ఉచిత కోచింగ్ నిర్వహించి వందలాదిమంది విద్యార్థులను ర్యాంకర్లుగా తయారుచేసి ఉద్యోగస్తులుగా అవకాశం కల్పించామని విద్యార్థి యువతకు మంచి భవిష్యత్తును పొందేలా కృషి చేశారని, దాదాపు 36 జంటలకు ఉచితంగా ఆదర్శ వివాహాలు జరిపించామని, ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు నిర్వహించేవారుమని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయని తద్వారా నేర్చుకున్న నాయకత్వ లక్షణాలు సేవా నిరతని గుర్తించి బిజెపి నేడు తనకి తగిన బాధ్యతలు ఇచ్చి మంచి గుర్తింపు ఇస్తూ ఉందని తన మాతృ సమస్త ఏబీవీపీని తాను జీవించి ఉన్నన్నాళ్ళు మర్చిపోలేనని అన్నారు. అలాగే తాను ఏబీవీపీకి తన వంతు సేవలు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటానని తెలిపారు మరియు ఏబీవీపీ పూర్వ ప్రస్తుత నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

పై కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు ఏం.రవీంద్రబాబు, పోలిచర్ల.ఉదయ్ కుమార్, గోపి నాయుడు, మురగ.నరేష్ విభాగ్ ప్రముఖ పరదేశి.గంగాధర్, జిల్లా వ్యవస్థా ప్రముఖ నాగినేని.జగన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనిష్ రెడ్డి, రాహుల్, జస్వంత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed