*మనసు మార్చుకుని చంద్రబాబు కాళ్లు పట్టుకో  మాజీ సీఎం జగన్ కు హితవు : నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి*

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతులు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తే తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకొస్తే మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. తాను సీఎం అవుతానని జగన్ పదేపదే చెబుతూ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని బావిలో దూకాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన పాపాలకి వందల భావుల్లో దూకాలంటూ కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని చంద్రబాబు కాళ్లు పట్టుకోవాలని.. లేదంటే చరిత్రహీనుడిగా మారిపోతారంటూ విమర్శించారు. కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా గతంలో జగన్ పనిచేశారని.. వైసీపీని మూసేసుకొని.. జగన్ టిడిపిలో చేరాలంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వైసిపి నేతలందరూ జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే జగన్ పార్టీని మూసేసుకుని జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.. సూపర్ సిక్స్ లో లేని హామీలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అంగన్వాడీలకు కూడా ప్రభుత్వం ఎంతో లబ్ది చేకూర్చిందని వివరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి లక్షలాదిమంది జనం వస్తే.. జనాలు లేరని జగన్ కళ్ళులేని కబోదిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని.. అప్పుడే రాష్ట్ర ప్రజలు క్షమిస్తారని లేకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రౌడీల పార్టీ అని.. తాను టిడిపి నగర ఇంచార్జిగా ఉన్న సమయంలో తనను చంపాలని వైసీపీ గూండాలు చూశారని ఆరోపించారు. తనను కారుతో గుద్దించారని.. ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం లేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed