*SPS నెల్లూరు జిల్లా,*

*బ్లాక్ స్పాట్ లపై పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,.*

• జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో బ్లాక్ స్పాట్‌లు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ.
• జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన 36 బ్లాక్ స్పాట్‌లలో రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
• ప్రజల ప్రాణ రక్షణ, భద్రతే ముఖ్య లక్ష్యంగా తీసుకొని, జిల్లా వ్యాప్తంగా పోలీసులు బ్లాక్ స్పాట్‌ల వద్ద స్పెషల్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.
• బ్లాక్ స్పాట్‌లలో వాహనదారులకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా హెచ్చరిక బోర్డులు, సరిపడా లైటింగ్ ఏర్పాటు, రేడియం స్టిక్కర్లు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.
• రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వాహనదారులు కూడా అతివేగం ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.
• వాహనదారులు ఇంటి వద్ద తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేసుకొని బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు.
• ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ప్రామాణికత కలిగిన హెల్మెట్ ధరించాలి అని స్పష్టం చేశారు.
• జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని జిల్లా పోలీసులకు ఆదేశించారు.
• వాహనదారుల ఉల్లంఘనలైన సీటు బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్ వంటి నేరాలకు జరిమానాలు విధించాలని ఆదేశించారు.
• రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
• అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
• ఈ కాన్ఫరెన్స్ నందు జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, SB DSP శ్రీ శ్రీనివాస రావు గారు, సబ్ డివిజన్ పోలీసు అధికారులు, SB, PCR, DCRB CI గార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.05.01.2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed