*బి పి ఎస్, ఎల్ఆర్ఎస్  గోడపత్రికలను  అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శించేలా, బిపిఎస్ స్టిక్కర్లను అన్ని అనధికార భవనాలకు అంటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం : నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పథకాల గోడపత్రికలను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాలయంలో ఆవిష్కరించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పథకాలపై అవగాహన సదస్సును, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన యజమానుల సౌకర్యార్థము పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు ఈ నారాయణ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బి.పి.ఎస్ – 2025 ఎల్.ఆర్.ఎస్ – 2025 పథకాల మార్గదర్శకాలను జారీ చేసి ఉందని తెలిపారు.

బి.పి.ఎస్ పథకంలో 01-01-1985 నుంచి 30-08-2025 మధ్యకాలంలో అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను 11-03-2026 తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దాఖలు చేసుకోవాలని తెలియజేశారు. పూర్తి వివరాల కోసం WWW.BPS.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించాలని తెలిపారు.

ఎల్.ఆర్.ఎస్ – 2025 పథకంలో అనధికార లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యపు హక్కును పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

30-06-2025 తేదీకి ముందు వేసిన అనధికార లేఆవుట్లలోని రిజిస్టర్ కాబడిన అనధికార ప్లాట్లను ప్రణాళిక బద్ధంగా క్రమబద్ధీకరించేందుకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని కమిషనర్ తెలియజేశారు. పూర్తి వివరాలకు 1800-425-1113 టోల్ ఫ్రీ నెంబరును లేదా 7981651881 నెంబరు హెల్ప్ లైన్ ను సంప్రదించాలని, అధికారిక వెబ్సైట్ (http://dtcp.ap.gov.in/LRS/) లో వివరాలు నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల కోసం అవసరమైన వ్యయాన్ని సమకూర్చేందుకు ఇలాంటి పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పథకాల అమలు ద్వారా ప్రజలు తమ లేఅవుట్ ప్లాట్లు, భవనాలకు పూర్తి యాజమాన్య హక్కులను పొందగలరని తెలియజేశారు.

కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఓపన్ ఫోరం కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన సమస్యలపై ప్రజల నుంచి 11 వినతి పత్రాలను అందుకని వాటికి అధికారులు శాశ్వత పరిష్కారాలను అందించారు.

ఆవిష్కరించిన గోడపత్రికలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శించేలా, బిపిఎస్ స్టిక్కర్లను అన్ని అనధికార భవనాలకు అంటించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, వందవాసి రంగా, నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రఘునాథరావు, వేణు, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed