*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన  కమిషనర్ వై.ఓ. నందన్*


 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ వై.ఓ. నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశముల మేరకు టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. టిడ్కో గృహాల కోసం అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని, స్థానిక సచివాలయంలో అమెనిటీస్ కార్యదర్శిని లేదా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.

ఎల్.ఆర్.ఎస్ పథకం ఆవశ్యకతను గుర్తించి అనధికార లేఔట్ల యజమానులు, స్థలాల యజమానులు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన క్రమబద్ధీకరణ విధానం ద్వారా యాజమాన్యపు హక్కులను పొందాలని కమిషనర్ సూచించారు. ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ పథకాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.

నెల్లూరు నగర పాలక సంస్థకు సంబంధించిన అన్ని పౌర సేవలను పురమిత్ర యాప్ ద్వారా సులభతరంగా అందిస్తున్నామని, ప్రతి ఒక్కరు తమ ఫోన్ లో పురమిత్ర యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో సేవలు పొందాలని కమిషనర్ సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ 1, ఆప్కాస్ 6, ఇంజనీరింగ్ 10, హౌసింగ్ సెక్షన్ 23, పెన్షన్ 1, పబ్లిక్ హెల్త్ 4, రెవెన్యూ 3, టౌన్ ప్లానింగ్ 5, మొత్తం 53 వినతులను కమిషనర్ స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ రహంతు జానీ, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed