*ప్రజారోగ్య రక్షణకు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు అభినందనీయం*

*సీఎం చంద్రబాబు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత*

*యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా పేదలకు 25 లక్షల వరకు హెల్త్ బెనిఫిట్స్  : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

KVSR (కూనం వెంకట సుబ్బారెడ్డి) ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూనం వెంకట సుబ్బారెడ్డి గారి 14వ వర్ధంతి, వారి కుమారుడు అనిల్ రెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా బద్ధిపూడిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారితో కలిసి ఉలవపాడు మండలం బద్దిపూడిలో కేవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. కూనం వెంకటసుబ్బారెడ్డి గారి సతీమణి ఈశ్వరమ్మ కు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గ్రామస్థుల ఆరోగ్య రక్షణకు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని, టిడిపి నాయకులు, సుబ్బారెడ్డి గారి తనయుడు రాఘవ రెడ్డికి, బ్రహ్మానంద రెడ్డికి తన అభినందనలు తెలిపారు. గ్రామాల్లో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అవసరమన్నారు. గ్రామస్థులు ఆరోగ్యం బాగా లేకున్నా అంతగా పట్టించుకోరని, ఆసుపత్రికి వెళ్లాలంటే ఆలోచిస్తుంటారన్నారు. కాబట్టి ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని చెక్‌ అప్‌ చేయించుకోవాలని సూచించారు.

సీఎం చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా సీఎం చంద్రబాబు గారు పనిచేస్తున్నారన్నారు. Universal health policy ద్వారా పేదలకు 25 లక్షల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఈ తరహా పాలసీని తీసుకురాలేదని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు కోటి సంతకాల పేరుతో అనవసర రాద్దాంతం చేస్తున్నారని, PPP విధానంపై అవగాహన లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు చేర్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed