
*పోలేరమ్మ జాతర మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక*
– వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు.
– వేమిరెడ్డి దంపతులకు ఆలయ పెద్దల ఘన స్వాగతం.
– పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి కృపతో ఆంధ్రప్రదేశ్ రాష్టం పరిశ్రమలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వైభవంగా నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతరకు హాజరైన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు వేమిరెడ్డి దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. జాతర సందర్భంగా పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక ఐక్యత, భక్తి, ప్రవృత్తికి ప్రతీకలన్నారు. చారిత్రాత్మక వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు 40 లక్షల రూపాయలు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి కార్యవర్గంతో పాటు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, నెల్లూరు డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.