
*పొట్టి శ్రీరాములు గారి నామకరణంతో నెల్లూరు జిల్లా ఏర్పడటం గర్వకారణం, నెల్లూరు జిల్లాతో పొట్టి శ్రీరాములు గారిది విడదీయలేని బంధం. : బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు మరియు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు పార్లమెంట్.*
*పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను భావితరాలకు గుర్తు చేస్తూ అమరావతిలో నిర్మించిన “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్” స్మారకంను ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు నేడు జాతికి అంకితం చేశారు.*
*పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల స్మారక కాంస్య విగ్రహం ను, 6.7 ఎకరాల్లో స్మృతివనం ను ప్రారంభించి, పొట్టి శ్రీరాములు గారి పట్ల ఉన్న గౌరవం, చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం చాటుకుంది.*
*మోడల్ విలేజ్ గా చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన జువ్వల దిన్నెలో, కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆధ్వర్యంలో రాబోయే పొట్టి శ్రీరాములు గారి జయంతి లోగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం.*
*బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు మరియు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు పార్లమెంట్.*
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా, జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా గారితో కలిసి నెల్లూరు నగరం, ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి శాసనమండలి సభ్యులు, టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి,జన్ని రమణయ్య, భూలక్ష్మి,హరిబాబు తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ…..
నెల్లూరు జిల్లాతో పొట్టి శ్రీరాములు గారిది విడదీయలేని బంధం. వారి నామకరణం తోనే “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా” ఏర్పడింది.
పొట్టి శ్రీరాములు గారితో అనుబంధమున్న జువ్వలదిన్నె గ్రామాన్ని “శ్రీ పొట్టి శ్రీరాములు మోడల్ విలేజ్” గా ఏర్పాటు చేస్తూ అప్పటి (2014-19) తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు.
జువ్వలదిన్నె గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు అనేక అభివృద్ధి పనులకు నిధులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేశాం.
పొట్టి శ్రీరాములు గారి రానున్న జయంతి నాటికి, జువెలదిన్నెలో బ్రిడ్జి, ఫిషింగ్ హార్బర్, రోడ్లు, స్కూల్స్ తో పాటు పెండింగ్ లో ఉన్న టూరిజం ప్రాజెక్టు, ఇతర వసతులను కలెక్టర్ హిమాన్షుశుక్లా గారి సహకారంతో ఏర్పాటు చేసుకుంటాం.
శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతివనంను అమరావతిలో 6.7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్ర నలువైపుల నుండి తరలివచ్చిన వైశ్య సోదరులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మారక కాంస్య విగ్రహం ప్రారంభోత్సవంను ఘనంగా నిర్వహించుకున్నాం.
శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ, ఇతర అభివృద్ధి, నిర్మాణాల కార్యక్రమాలలో భాగస్వామ్యులు అవుతామని ముందుకు వచ్చినవారికి కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.