*పేదల సేవతో అంబరాన్ని అంటిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు..*

*మనసున్న మా రాజు, యువరాజు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు*

*తిరుపతి అసెంబ్లీ టీడీపీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గుమ్మడి రాజా యాదవ్*

*సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో శుక్రవారం గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో పేదలకు సేవ చేస్తూ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి.*

*వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలోని ఆలయంలో శ్రీ నారా లోకేష్ గారి పేరిట ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గొలగమూడి విశాలాక్షి వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత వెంకటాచలంలోని మానసిక దివ్యాంగుల కేంద్రంలో చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంచి పెట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన .*

*రాజా యాదవ్ కామెంట్స్*

రాష్ట్ర ఐ.టి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది

రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మన యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన తనయుడు శ్రీ నారా లోకేష్ గారి సారధ్యంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారు

విద్యాశాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన ఘనత మంత్రి శ్రీ నారా లోకేష్ గారికే దక్కుతుంది

రాష్ట్ర దశదిశ మార్చింది శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్రే

వైసీపీ హయాంలో సాగిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను ఎదురొడ్డి నిలబడి రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టారు

కీలకమైన విద్య, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ గారు కొనసాగుతుండటం రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలి

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారధ్యంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యబోధన సాగుతోంది

*ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా శ్రీ నారా లోకేష్ గారికి ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నా…*

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, నారా లోకేష్ గారి అభిమానులు, రాజన్న సైన్యం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed