*పునరావాస కేంద్రంలోని చిన్నారులతో  ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి కుటుంబ వివరాలు, విద్యాబుద్ధులు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్న కమిషనర్*ఆ 

 

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 30 వ డివిజన్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రభావానికి గురైన లోతట్టు ప్రాంతాలలోని ప్రజలకు కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు అధికారులు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రాంగణంలో పునరావాసం కల్పించారు.

పునరావాస కేంద్రంలో బాధితులకు అందిస్తున్న సదుపాయాలను జోరు వాm.,lనలో సైతం కమిషనర్ గురువారం పరిశీలించి వరద ప్రభావం తగ్గేంతవరకు కేంద్రంలో అన్ని వసతులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

పునరావాస కేంద్రంలోని చిన్నారులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి కుటుంబ వివరాలు, విద్యాబుద్ధులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యకు దూరం కాకూడదని, విద్యతోనే ఉన్నత స్థాయి జీవనం సాగించగలమని చిన్నారులకు కమిషనర్ వివరించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి వరద ప్రభావానికి గురైన ప్రాంతాలలోని ప్రజలను యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed