
*పార్కులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి. నిర్మాణ పనులను వేగవంతం చేసి పార్కులను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఆర్.ఎస్.ఆర్ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానిక బాల భవన్ పార్కు, రేబాల వారి పార్కులను కమిషనర్ ముందుగా సందర్శించి పార్కులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి పార్కులను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం ఆర్.ఎస్.ఆర్ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న నూతన తరగతి గదుల నిర్మాణం పనులను కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో నిర్దేశించిన సమయంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.