*పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి నిధులు కేటాయించండి*

– కనిగిరి రిజర్వాయర్ షట్టర్లు, సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ దెబ్బతిన్న షట్టర్లు మరమ్మత్తులకు నిధులివ్వండి.
– పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి 14 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో మొమరాండం.
– ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామా నాయుడుతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భేటి.

ఇందుకూరు పేట మండలంలోని సముద్ర తీర గ్రామాలైన గంగపట్నం, పల్లిపాళెం మరియు మైపాడు గ్రామాలను అనుసంధానం చేసే పల్లిపాళెం ఉప్పుటేరు పై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విజయవాడలోని ఇరిగేషన్ శాఖ క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి నియోజకవర్గ సాగునీటి సమస్యలపై చర్చించారు. పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి 14 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో రూపొందించిన వివరాలను అందచేశారు. 2021 లో నివార్ తుఫాను కారణంగా వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన ధ్వంసం అయిన విషయాన్ని ఆమె మంత్రి గారి దృష్టికి తెచ్చారు. వరదల్లో బ్రిడ్జ్ కొట్టుకుపోయాక పొలాలకు వెళ్లే రైతులు, సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తీవ్ర యిబ్బందులు పడుతున్నారని తెలిపారు. గంగపట్నం, పల్లిపాళెం మరియు మైపాడు గ్రామాల ప్రజల అవసరరాలను దృష్టిలో వుంచుకొని
పల్లిపాళెం ఉప్పుటేరు బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కోరారు. అనంతరం కనిగిరి రిజర్వాయర్ షట్టర్లు, సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ దెబ్బతిన్న షట్టర్లు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయవలసిందిగా ఆమె మంత్రి నిమ్మలకు మనవి చేశారు. పెన్నా డెల్టా పరిధిలోని సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి నిమ్మలను కలిసిన వారిలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో పాటు పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, MSME డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed