
*నెల్లూరు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సతీమణి రమాదేవి*
*సీతారాముల కల్యాణంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి*
*నగరమంతా రామనామ స్మరణ..రమాదేవి రాకతో సందడి*
*సీతమ్మ ఆశీస్సుల కోసం భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న రమాదేవి*
సీతారాములు ఆదర్శ దంపతులని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పేర్కొన్నారు .సీతమ్మతల్లి ఓర్పు మహిళలందరికీ స్ఫూర్తి దాయకమన్నారు .అయోధ్య రామయ్య చల్లని చూపుతో రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలని ఆకాంక్షించారు .
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో పలు ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి శుక్రవారం దర్శించారు .ప్రజలకు,మహిళా లోకానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.వెళ్లిన ప్రతీ చోటా రమాదేవికి ఘన స్వాగతం పలికారు .సీతారాముల కల్యాణాన్ని భక్తులతో కలిసి వీక్షించిన రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ధర్మానికి మారుపేరైన శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో మళ్ళీ సువర్ణ యుగం రావాలని, ప్రజల క్షేమం కోసం పరితపించే మంత్రి నారాయణ గారి సంకల్పాలకు దైవబలం తోడవ్వాలని ఆకాంక్షించారు. సీతమ్మ తల్లి ఓర్పు మన మహిళలందరికీ స్ఫూర్తి అని, మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నగరంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు .నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్, 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా, 13వ డివిజన్ లక్కీ బోర్డ్ సెంటర్, 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ మరియు విజయమహల్ సెంటర్, 44 డివిజన్ ట్రంక్ రోడ్డు, 8వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ప్రాంతాల్లోని హనుమాన్ మందిరాలు మరియు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో సీతారామ కల్యాణ మహోత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారని అభినందించారు. నెల్లూరు ప్రజలందరూ సిరిసంపదలతో తులతూగాలని, ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని రమాదేవి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
రమాదేవితో పాటు జిల్లా మార్కెటింగ్ కమిటీ సభ్యురాలు గుణుకుల విజయలక్షి ,కాపుభవన్ కమిటీ సభ్యురాలు సూరిశెట్టి గాయత్రి , జిల్లా ఆర్యవైశ్య సంగం మహిళా మాజీ అధ్యక్షురాలు మెంటా కళ్యాణి ,ఉస్మాన్ సాహెబ్ పేట రామాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు ,డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు .