
*నెల్లూరు నగర పరిధిలోని 27 వ డివిజన్ రిత్విక్ ఎనక్లేవ్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*
స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లను సందర్శించి వాటికి సంబంధించి అన్ని ప్లాట్లకు అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క ఫ్లాట్ యజమానికి అసెస్మెంట్ డిమాండ్లను జారీ చేయాలని, ఆస్తి కలిగిన ప్రతి ఒక్కరిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని రెవెన్యూ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.
స్థానికంగా జరుగుతున్న నూతన భవనాల నిర్మాణాలను కమిషనర్ పరిశీలించి నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించి ఖాళీ స్థలాల పన్నులు చెల్లింపులను తనిఖీ చేశారు.
నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డివిజన్ పరిధిలో వర్షపు నీటి ప్రవాహానికి, డ్రైను కాలువలకు ఉన్న అడ్డంకులను పరిశీలించి పూడికతీత పనులను , సిల్ట్ ఎత్తివేత చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక పార్కులను కమిషనర్ సందర్శించి అన్ని వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధి మురహరి , నెల్లూరు నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.