
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం, రెవిన్యూ అధికారులతో నక్ష ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష సర్వే ప్రాజెక్టు నిర్వహణలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే ఫీల్డ్ సర్వే టీం లను పర్యవేక్షించేందుకు డివిజన్ల వారీగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుల బృందాన్ని కేటాయించినట్లు తెలిపారు.
ఫీల్డ్ సర్వే టీం ల ద్వారా ప్రతిరోజు వార్డు పరిధిలో ప్రభుత్వ/ ప్రైవేటు 30 భవనాలకు గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే నిర్వహించి ఆన్లైన్లో వెక్టరైజేషన్ పనులను పూర్తిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
నక్ష ప్రోగ్రాం నిర్వహణకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి, దైనందిన పురోగతి నివేదికలను ప్రతిరోజు డిప్యూటీ సిటీ ప్లానర్ కు, తద్వార డైరెక్టర్ మున్సిపల్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,వడ్డేశ్వరం వారికి రిపోర్ట్స్ సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సిటీ ప్లానర్ హిమబిందు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, టి.పి.ఓ లు, సర్వేయర్ కామేశ్వరరావు, రెవిన్యూ అధికారులు,ఇన్స్పెక్టర్లు,రెవెన్యూ అధికారులు, నక్ష బృందం వార్డు ప్లానింగ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.