
SPS నెల్లూరు జిల్లా,
*నెల్లూరు టౌన్ లోని ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశం నిర్వహించిన నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS.,*
గుంటూరు రేంజ్ IG గారు మరియు జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశం నిర్వహించారు.
నెల్లూరు టౌన్లో నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.
ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రవర్తనకు దూరంగా ఉండాలి.
ఎవరితోనూ దౌర్జన్యంగా లేదా దురుసుగా ప్రవర్తించరాదు.
బెగ్గింగ్, ఎక్స్టార్షన్, దొంగతనాలకు పూర్తిగా దూరంగా ఉండండి. వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము.
నెల్లూరు టౌన్లో డ్రోన్లు మరియు CC కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఓపెన్ డ్రింకింగ్ చేయరాదని, గాంజా వంటి మాదక ద్రవ్యాల సేవనము లేదా అమ్మకం సహించేది లేదు.
పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, చట్ట పరిరక్షణలో భాగస్వాములుగా ఉండాలని కోరారు.
ట్రాన్స్‌జెండర్స్ వారి వివరాలు, నైపుణ్యాల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశం నిర్వహించి మంచి మాటలు చెప్పిన ASP గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ట్రాన్స్‌జెండర్స్.
ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారితో పాటు నెల్లూరు టౌన్ CI గార్లు పాల్గొన్నారు.
.