
*నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమలు – ASP దీక్ష,*
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల్లూరు టౌన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ (Indian Police Act – Section 30) అమల్లో ఉందని టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారు తెలిపారు.
30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో ప్రజా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలంటే సబ్ డివిజన్ పోలీస్ అధికారి నుంచి ముందుగా తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు.
ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నట్లయితే, సంబంధిత సమావేశాలు లేదా కార్యక్రమాలను నిషేధించే అధికారం పోలీస్ అధికారులకు ఉంటుందని తెలిపారు.
అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి, చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణం కొనసాగేందుకు సహకరించాలని కోరారు.
.