*నెల్లూరు జిల్లాలో 2000 మంది షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు వీధినపడి ఉన్నారు*.

*చట్ట ప్రకారం వారి వేతనాలు చెల్లించాలని బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్* 

పొదలకూరు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలలో 2000 మంది కార్మికులకు బకాయిలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు లేబర్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు .అసిస్టెంట్ కమిషనర్ గౌస్ లను కలిసి డిమాండ్ చేశారు

పొదలకూరు షుగర్ ఫ్యాక్టరీనిచట్ట వ్యతిరేకంగా యాజమాన్యం 2019 లో.మూసేస్తే 428 మంది కార్మికులు వీధిన పడ్డారు. 120 మంది కార్మికులు లేబర్ కోర్టు ను ఆశ్రయించి నాలుగు కోట్లు బకాయిలు చెల్లించమని ఆదేశాలు పొందారు
గత ఐదు సంవత్సరాలుగా యాజమాన్యం లేబర్ కోర్ట్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉంది. ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేయడంలో రాజకీయ ఒత్తిడికి లొంగి కార్మికుల జీవితాలతో చెలగాడ మారుతున్నారు.

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ లో 1600 మంది కార్మికులు పనిచేశారు. మూడు సంవత్సరాల క్రితం రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు 108 కోట్లు ప్రభుత్వం కేటాయించగా కేవలం ఫ్యాక్టరీ కార్మికులకు చెందాల్సిన 23 కోట్ల రూపాయలు ఆనాటి పాలకులు ఆ నిధులను మళ్లించుకున్నారు.

జిల్లాలో 2000 కుటుంబాలు ఈ వేతనాల కొరకు ఎదురుచూసి అనేకమంది మరణించడం వృద్ధాప్యం రావడం ఏ పని చేయలేకపోవడం వలన ఆర్థిక సమస్యలలో ఆ కుటుంబాలు అల్లాడుతున్నాయి. ప్రస్తుత ఓటమి ప్రభుత్వం కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐనకోట రఘురామయ్య. నరాల సుబ్బారెడ్డి లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *