*నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 18 వ డివిజన్ హరనాథపురం 2 వ వీధి నుంచి ప్రారంభించి పరిసర ప్రాంతాలలో గురువారం పర్యటించారు.

డివిజన్ పరిధిలో వర్షపు నీటి ప్రవాహానికి, డ్రైను కాలువలకు ఉన్న అడ్డంకులను పరిశీలించి పూడికతీత పనులను , సిల్ట్ ఎత్తివేత చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లను సందర్శించి వాటికి సంబంధించి అన్ని ప్లాట్లకు అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క ఫ్లాట్ యజమానికి అసెస్మెంట్ డిమాండ్లను జారీ చేయాలని, ఆస్తి కలిగిన ప్రతి ఒక్కరిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని రెవెన్యూ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.

స్థానికంగా జరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. అపార్ట్మెంట్ కు సంబంధించి వేకంట్ ల్యాండ్ టాక్స్ చెల్లింపులను తనిఖీ చేశారు.

నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధి అశోక్ కుమార్, నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *