*SPS నెల్లూరు జిల్లా*

*నవాబ్ పేట, సంతపేట మరియు బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS.,*

 నవాబ్ పేట, సంతపేట మరియు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజి గారు, జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారితో పాటు కలిసి సందర్శించడం జరిగినది.
 పోలీసు స్టేషన్ ల మ్యాప్ లను పరిశీలిస్తూ, స్టేషన్స్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా..
 పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డుల పరిశీలించిన ఐ.జి. గారు.
 జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. జిల్లాను పూర్తిగా నేరరహితంగా, ప్రజలు యథావిధిగా ప్రశాంతంగా జీవించగల వాతావరణం ఉండుటకు తగిన చర్యలు.
 యాక్టివ్ రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి. ఎలాంటి రౌడీ మూకలు శాంతి భద్రతలకు భంగం కలిగించినా క్షమించేది లేదు.
 క్రైమ్ ప్రోన్ ప్రాంతాలలో నిరంతర నిఘా, ప్రత్యేక బృందాల పర్యవేక్షణ కొనసాగుతుంది.
 రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, క్రిమినల్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండేలా మార్గనిర్దేశనం.
 పునరావృత నేరాలు చేసే రౌడీలు, గ్యాంగ్ సభ్యులపై PD యాక్ట్ వర్తింపజేస్తాం. నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను కూడా సీజ్ చేసే విధంగా దర్యాప్తు కొనసాగిస్తామని హెచ్చరిక.
 పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలు సృష్టించే రౌడీలను పోలీసులు పెరేడ్ చేయిస్తారు. ప్రజల మధ్య రోడ్లపై నడిపిస్తూ వారి క్రిమినల్ ప్రవర్తనను అరికట్టే దిశగా తగిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
 ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, నేరాల విచారణలో పారదర్శకత, రెస్పాన్స్ టైమ్ తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.
 జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్ లను గురించి, రోడ్డు భద్రత నియమాల గురించి వాహనదారులతో పాటు పట్టణ, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు.
 పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రధమ కర్తవ్యం… పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు..
 ఈ తనిఖీలో IG గారితో పాటు జిల్లా యస్.పి. గారు, సంబంధిత DSP, CI, SI గార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.10.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed