*నల్లపరెడ్డి కుటుంబ ప్రతిష్టను మంట కలిపిన ప్రసన్న..*

*శాసన మండలి సభ్యులు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – బీద రవిచంద్ర*

స్వయాన సోదరి వరసైన ప్రశాంతమ్మపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.

మహిళా ప్రజా ప్రతినిధి ప్రశాంతమ్మ పై ప్రసన్న కుమార్ రెడ్డి మకిలి వ్యాఖ్యలను మహిళా లోకం క్షమించదు.ప్రశాంతమ్మ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక, ఎన్నికల ఓటమి ని జీర్ణించుకోలేక, పాలనా పరంగా విమర్శలు దొరకక మతి భ్రమించి ప్రసన్న మాట్లాడుతున్నారు.

మురికి వ్యాఖ్యలతో నెల్లూరు రాజకీయ విమర్శల అర్థమే మార్చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి

మహిళా ప్రజాప్రతినిధి ప్రశాంతమ్మ పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలి.విశ్వాసం అన్న పదం కు అర్థం తెలియని వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. సాయపడినవారి పై రాళ్లు విసరడం ప్రసన్న కుమార్ రెడ్డి బలహీనత.

తనకు రాజకీయ భవిష్యత్తు ను ప్రసాదించారన్న కృతజ్ఞత మరచి “ఒరేయ్ చంద్రబాబు…నిన్ను చెట్టుకు కట్టేసి కొడతాన”ని మాట్లాడిన వ్యక్తి ప్రసన్న.

ఆనాటి మంత్రి రాజ్యలక్ష్మి కట్టి విడిచిన చీరలను కట్టుకుంటున్నావంటూ అప్పటి కలెక్టర్, ఆర్డీవోలను ఉద్దేశించి చేసిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలు నెల్లూరు ప్రజలు మరచిపోలేదు.

బీహార్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ ఏం పీకుతావ్ ? అంటూ ఆనాటి నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దూషణలు రాజ్యాంగం ను అపహాస్యం చేశాయి.

కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి కుటుంబంపై ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడించిన జుగుప్సాకరమైన భాష మరచిపోవడానికి సాధ్యమా?

గత 7 సంవత్సరాలుగా విపిఆర్ దంపతులపై కురిపించిన ప్రశంసలు జిల్లా ప్రజలకు గుర్తున్నాయి.

పూనకం వచ్చినట్టు నాడు “జొన్నవాడ కామాక్షమ్మ గుడిలో అమ్మవారికి బదులుగా నిన్ను ప్రతిష్టించాలి”, నల్లపురెడ్ల ఇలవేల్పు కోటమ్మ తల్లి కాదమ్మా… నువ్వే ప్రశాంతమ్మ” అంటూ చేసిన పొగడ్తలు, భజనలు మరచిపోతే ఎలా ప్రసన్న?

వారి సోదరులతో ప్రసన్న కుమార్ రెడ్డి కి సాగిన సరదా ఫోన్ సంభాషణలను గత ఎన్నికల సందర్బంగా బహిరంగ పరిచి ప్రజామోదం లభించక నాడు నవ్వుల పాలు అయ్యారు.

కోవూరు ఎన్నికల చరిత్రలో 54,583 ఓట్లు ఆధిక్యత తో ప్రశాంతమ్మ ను గెలిపించుకుని ప్రసన్న ను ఇంటికి సాగనంపారు. ప్రజలు ఛీ కొట్టినా ప్రసన్న వక్రబుద్ధి మారలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed