- *నన్ను తిట్టడం తప్ప మంత్రిగా సర్వేపల్లికి కాకాణి చేసింది సున్నా : సోమిరెడ్డి*
*పోర్టులో కూలీల కష్టార్జితాన్ని కూడా దోచుకుంటున్న కాకాణి బ్యాచ్*
*ముత్తుకూరు మండలాన్ని కాలుష్యమయం చేశారు*
*కొత్తగా ఒక్క పరిశ్రమ తేలేకపోవడంతో భూములిచ్చిన రైతుల త్యాగానికి విలువ లేకుండా పోయింది*
*ఎన్డీఏ అధికారంలోకి రాగానే సెజ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం*
*కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణే నా లక్ష్యం*
*ముత్తుకూరు మండలం ఈపూరు, పంటపాళెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
కృష్ణపట్నం పోర్టు వద్ద కాకాణి ప్రైవేటు టోలుగేటు తెరిచి కంటైనర్ టెర్మినల్ ను తమిళనాడుకు తరిమేశారు.
పోర్టు మొత్తం బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ మయమై ఆ కాలుష్య ప్రభావం ప్రజలపై పడుతోంది
ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది
పామాయిల్ ఫ్యాక్టరీల్లోనూ పొట్టును కాలుస్తున్న కారణంగా వెలువడుతున్న దుమ్ముతోనూ కష్టాలే
ఓ వైపు దుమ్ము, మరో వైపు ఎండను భరిస్తూ రోజూ కూలీలు కృష్ణపట్నం పోర్టులో కష్టపడి పనిచేస్తున్నారు
రోజంతా పనిచేస్తే వారికి రూ.350 కూలి ఇస్తే, అందులో రూ.100 కాకాణి బ్యాచ్ కొట్టేస్తోంది. మిగిలిన రూ.250లో రూ.50 ఆటో చార్జీలకు పోతే ఇక వారు తినేదెంత
ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుగుముఖం పడితే వారికి గిట్టుబాటయ్యే కూలి రూ.200 మాత్రమే
పట్ట కడితే కూలీలకు రూ.150 వస్తే అందులోనూ రూ.100 కొట్టేసి రూ.50 ఇస్తున్నారు
కనీస వేతనచట్టం ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. సంబంధిత కార్మిక శాఖ అధికారులు ఏం చేస్తున్నారో
వైసీపీ పాలనలో వ్యవస్థలు మొత్తం సర్వనాశనమైపోయాయి.
టీడీపీ అధికారంలోకి రాగానే కూలీల కష్టార్జితం వారికే దక్కేలా చేస్తాం. పేదలకు అండగా నిలుస్తాం
సర్వేపల్లి నియోజకవర్గవ్యాప్తంగా మంత్రి కాకాణి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అందరి దృష్టి దోపిడీపైనే ఉంది
కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ, థర్మల్ ప్రాజెక్టు పరిరక్షణ, పామాయిల్ ఫ్యాక్టరీల కాలుష్యం తదితర అంశాలన్నింటిపై నా పోరాటం కొనసాగుతుంది
కృష్ణపట్నం ఎస్ఈజెడ్ లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నా, ఒక్క పరిశ్రమ తేలేకపోయారు
భూములు విషయంలో రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండాపోయింది
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూముల్లో వీలైనన్ని పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం
మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నన్ను తిట్టడం తప్ప ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు