*ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు*
*కచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందే*
*నెమ్ము, తరుగుల పేరుతో వేధించినా ఊరుకోం*
*రైతుకు అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు*
*అమరావతిలో నిర్వహించిన సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ నిర్ణయం*
ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని చెప్పిన కలెక్టర్ ఆనంద్
రైతు కుటుంబసభ్యుల ఫొటో లేకుండానే కొనుగోలు ప్ర్రక్రియ
తక్కువ ధర చెల్లించినా, తరుగు, నెమ్ము పేరుతో ఎక్కువ ధాన్యం తీసుకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచన
దళారులతో పాటు సంబంధిత రైసుమిల్లర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన కలెక్టర్
రైతులకు ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలని సూచన
*సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్యా కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్*