*దక్షిణ కోస్తా IG శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు ఈరోజు దక్షిణ కోస్తా గుంటూరు రేంజ్‌ IG శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రజా శాంతి భద్రత అంశాలపై చర్చించారు.

*ఈ సమావేశంలో శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి సూచన మేరకు మరియు శ్రీమతి డాక్టర్ అజితా వేజెండ్ల IPS, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నెల్లూరు గారితో చర్చించిన పిదప, పోలీసు అధికారుల సేవల నిర్వహణను బలోపేతం చేయడం కోసం సహకారాన్ని ప్రకటిస్తూ, శ్రీ బీద రవిచంద్ర గారు (BMR సంస్థలు మరియు మిత్రుల సహకారంతో) 5 బొలెరో నియో వాహనాలు పోలీసు శాఖకు అందజేయడానికి అంగీకరించారు.*

ఈ వాహనాలు కింది పోలీస్ స్టేషన్ల అధికారులకు అందచేయనున్నారు:

* SI, అల్లూరు
* SI, బోగోలు
* SI, దగదర్తి
* ఇన్స్పెక్టర్, కావలి రూరల్ సర్కిల్
* కావలి రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్

అధికారులు తమ విధుల్లో ఉన్నప్పుడు త్వరితగతిన స్పందించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కదలికలు సులభతరం చేసేందుకు, ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ జీపులు దోహదపడతాయి.

ప్రజా భద్రత, శాంతి పరిరక్షణలో ముందు వరుసలో సేవలు అందిస్తున్న పోలీస్ శాఖకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

*శ్రీ బీద రవిచంద్ర గారి కార్యాలయము, నెల్లూరు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed