
*”తెలుగువాడి ఆత్మగౌరవం” నినాదంతో 44ఏళ్ల క్రితం ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ.*
*నాటికి, నేటికి, ఏనాటికి తెలుగుప్రజల గుండెల్లో చెక్కు చెదరని రూపం, చరిత్ర అన్న ఎన్.టి.ఆర్. : *- బీద రవిచంద్ర శాసనమండలి సభ్యులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.*
*తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించిన నాయకుడు అన్న ఎన్టీఆర్*
*బడుగు బలహీన, అట్టడుగు వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచిన నాయకుడు అన్న ఎన్టీఆర్.*
*ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా చంద్రబాబు సాగిపోతున్నారు, తాత, తండ్రి బాటలో యువనేత నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.*
*ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ను మననం చేసుకుంటూ వాడవాడలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.*
*- బీద రవిచంద్ర శాసనమండలి సభ్యులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.*
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి అధ్యక్షతన టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ను నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ….
44 సంవత్సరాల క్రితం భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించిన దినం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29, 1982.
తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో, ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ అందాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లోనే పెను మార్పులు సృష్టించిన మహనీయుడు, దైవాంశసంభూతుడు అన్న ఎన్టీఆర్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడుగు, బలహీన వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచిన నాయకుడు అన్న ఎన్టీఆర్.
రాజకీయమంటే ఊహలకు కూడా అందనటువంటి కుటుంబాలకు, వర్గాలకు, విద్యావంతులకు, సమాజంలో అట్టడుగుస్థాయిలో ఉన్నవారికి అవకాశాలు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్.
సామాన్యులను శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, జడ్పీ చైర్మన్లుగా తీర్చిదిద్ది అనేక పదవులు, అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
దళితుల కోసం ఎస్సీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీలకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనారిటీలకు మైనార్టీ కార్పొరేషన్ లు ఏర్పాటుచేసి చేయూత అందించారు ఎన్టీఆర్.
మహిళల కొరకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి వారి గుండెల్లో “అన్నగా” చిరస్థాయిగా నిలిచిపోయారు.
బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ఉన్నత విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్ ది.
రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరని ముద్ర వేసిన మహనీయుడు అన్న ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. తాత, తండ్రి బాటలో యువనేత నారా లోకేష్ సాగిపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ ని బలోపేతం చేసేందుకు, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు నారా లోకేష్ శ్రమిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమంను బాధ్యత గా చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని, అన్న ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ పార్టీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి.
రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అండగా నిలవాలి.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతకుమారి, దర్శి హరికృష్ణ, ఉప్పు భాస్కర్, శివాచారి తదితరులు పాల్గొన్నారు.