*తూర్పు రొంపిదొడ్లలో విపిఆర్‌ నేత్ర సేవలు*

– 203 మందికి కంటి పరీక్షలు చేసిన సిబ్బంది
– మంగళవారం గణేశ్వరపురం పంచాయతీలో అందుబాటులో ఉండనున్న బస్సు

ఎంతో ఉన్నత ఆశయంలో, గొప్ప సంకల్పంతో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గార్లు ప్రారంభించిన విపిఆర్‌ నేత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీలో 203 మందికి ప్రజలకు సిబ్బంది కంటి పరీక్షలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పరీక్షలు చేయగా 99 మందికి అద్దాలు అవసరం అని తేల్చి అద్దాలు అందజేశారు.

విపిఆర్‌ నేత్ర బస్సును. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గణేశ్వరపురం పంచాయతీలోని రామాలయం సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. కావున పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed