
ఢిల్లీకి చేరుకున్న.. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి
– రెండు రోజుల పాటు అక్కడే.. కేంద్ర గిరిజన నేతలతో భేటీ కి అవకాశం
– గిరిజనులకు జరుగుతున్నా అన్యాయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం
– స్పీడ్ పెంచిన గిరిజన నేతలు
——————-
మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. గిరిజనులకు జరుగుతున్నా అన్యాయాన్ని కేంద్ర పెద్దలతో పాటు, కేంద్ర గిరిజన నేతలను కలిసి వారికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పై కుట్రపూరితంగా వ్యవహరించిన తీరును వారికి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తో చేతులు కలిపి ఎన్నికల కమిషన్.. గిరిజనులకు చేస్తున్న అన్యాయాన్ని కూడా వివరించనున్నట్లు సమాచారం. గత 16 రోజులుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్ష కు వస్తున్న స్పందన పై కూడా కేంద్ర పెద్దలకు తెలిపే అవకాశం ఉంది. అవసరమైతే పార్లమెంట్ ఎదుట మాజీ మేయర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మంత్రినారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు గిరిజనుల గొంతు కోశారన్న విషయాన్ని కూడా అక్కడ మీడియాతో చెప్పనున్నట్లు సమాచారం. మొత్తానికి మాజీ మేయర్ దంపతులు ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని విస్తృతం చేసినట్లు తెలుస్తోంది.