
*డ్రైను కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించిన నగర కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జిఎన్టి రోడ్డు లక్కీ షాపింగ్ మాల్, బాబు ఐస్ క్రీమ్స్ వీధి, కాపు వీధి శివాజీ సెంటర్ ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైను కాలువల పనులను అధికారులతో కలిసి సోమవారం పర్యవేక్షించారు.
డ్రైను కాలువల నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన అన్ని ప్రమాణాలను పాటించి నాణ్యతతో త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు.