
*డ్యూటీలో మరణించిన కండక్టర్ కుటుంబానికి పరామర్శ – గాయపడ్డ మెకానిక్‌కు సహాయ భరోసా: ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి
ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ—
“మన ఆర్టీసీ కుటుంబంలో జరిగిన రెండు దురదృష్టకర సంఘటనలను చూసి చాలా బాధగా ఉంది. ఇటీవల డ్యూటీలో ఉండగానే అకస్మాత్తుగా మరణించిన వన్ డిపోకు చెందిన కండక్టర్ రాఘవయ్య గారి కుటుంబాన్ని ఈరోజు ఎన్టీఆర్ నగర్‌లో కలిసి పరామర్శించి, కర్మంత్రం లో పాల్గొనీ,వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రతి ప్రయోజనం తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారూ.
అలాగే, వన్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న నరసింహులు గారు ఇటీవలి కాలంలో డ్యూటీలో ఉండగా తీవ్ర గాయానికి గురై కాలు కోల్పోయిన విషయం తెలిసి గుడపల్లిపాడు వద్ద ఆయన బంధువుల ఇంటికి వెళ్లి పరామర్శించాను.
ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధిత పత్రాలను స్టేట్ బ్యాంక్–ఓరియెంటల్ ఇన్సూరెన్స్‌కు పంపించాం. త్వరలోనే క్లెయిమ్ మొత్తాన్ని పొందేలా సహకరిస్తాము.
నరసింహులు గారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను ప్రభుత్వం నుంచి సమయానికి అందించేందుకు ఆర్టీసీ తరఫున పూర్తి బాధ్యత తీసుకుంటాము. మన ఆర్టీసీ సిబ్బంది ఏ ఇబ్బందుల్లో పడినా, వారి కుటుంబాలు ఒంటరిగా లేరన్న భావన కలిగించడం మా విధి,” అని సురేష్ రెడ్డి తెలిపారు.