
*డిసెంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు : విద్యుత్ శాఖ*
డిసెంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు సందర్భంగా, ఈరోజు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఎం. వెంకటేశ్వర్లు, IAS గారు ఇంధన సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి రూపొందించిన పాంప్లెట్లు మరియు పోస్టర్లను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీ కె. రాఘవేంద్రం గారు, జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాల చంద్ర, శ్రీధర్, బెనర్జీ, భాను నాయక్, లక్ష్మీ నారాయణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
అవసరానికి మించి వినియోగాన్ని తగ్గించడం, సాంకేతికపరమైన ఉత్తమ పద్ధతుల ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాల్సిన అవసరాన్ని అధికారలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంధన పొదుపు చర్యలు పర్యావరణ పరిరక్షణకు, వనరుల సుస్థిర వినియోగానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
అదనంగా, ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సామాజిక సంస్థలు ఇంధన సంరక్షణ చర్యల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రస్తుత తరానికి మాత్రమే కాక భవిష్యత్ తరాలకు కూడా శుభ్రమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించేందుకు ఇది అత్యంత అవసరమని అధికారులు పిలుపునిచ్చారు.