*డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ బాబు అన్ని విధాల అర్హులే*

*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను.

ఆ పదవికి లోకేష్ బాబు వంద శాతం అర్హులే.

రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు.

లోకేష్ బాబు పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది.

డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును డిప్యూటీ సీఎం పదవికి పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *