
*టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపిన కమిషనర్ వై ఓ నందన్*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. టిడ్కో గృహాల కోసం అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని, స్థానిక సచివాలయంలో అమెనిటీస్ కార్యదర్శిని లేదా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
నగరవ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువలు, రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న అన్ని నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ తెలియజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ 2, అడ్మినిస్ట్రేషన్ 1, ఆప్కాస్ 1, ఇంజనీరింగ్ 5, హౌసింగ్ సెక్షన్ 19, పెన్షన్ 1, పబ్లిక్ హెల్త్ 2, రెవెన్యూ 5, టౌన్ ప్లానింగ్ 11, హెచ్ సెక్షన్ 1, మొత్తం 48 వినతులను కమిషనర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సిటీ ప్లానర్ హిమ బిందు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ శేషగిరి రావు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.