
నెల్లూరు, అక్టోబర్ 28 :
*జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*
మంగళవారం నెల్లూరు లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్ లతో కలసి పరిశీలించారు. తోలుత నెల్లూరు రూరల్ బుజ బుజ నెల్లూరులోని నేషనల్ హైవే పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం కొండ్లపూడి లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అందులో ఆశ్రయం పొందుతున్న వారిని పలకరించి అందుతున్న సౌకర్యాలు గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలసిపోయి వారి చదువుల గురించి తెలుసుకుంటూ, వారి తరగతి పుస్తకాలను అందించి చదివించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీరు ఎక్కడా నిలవకుండా కాలువలు ద్వారా సజావుగా వెళ్లేందుకు మున్సిపల్ అధికారులు నిరంతరం చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో మాదిరి కాకుండా రోడ్ల పై నీరు నిల్వ లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పునరావస కేంద్రాల్లో మంచి రుచికరమైన వేడి వేడి భోజనాన్ని అందించాలని, నిరంతర మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. చిన్నారులకు పాలు అందివ్వాలని సూచించారు. పునరావాసవ కేంద్రాల్లో పారిశుద్ధ్య విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రంలో అందించే భోజనాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వారికి వడ్డీంచడంతో పాటు వారిరువురు అక్కడే భోంచేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అనూష, ఇతర అధికారులు పాల్గొన్నారు.