
*జాకీర్ హుస్సేన్ నగర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
గోడ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.