
చెత్త తరలింపు వాహన ట్రిప్పుల సంఖ్యను పెంచండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సేకరించిన వ్యర్ధాలను డంపింగ్ యార్డులకు తరలించే వాహనాల ట్రిప్పుల సంఖ్యను మరింతగా పెంచాలని కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 9వ డివిజన్ బంగ్లా తోట, యనమల పాలెం, ఎఫ్సీఐ కాలనీ, నజీర్ తోట తదితర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు.
డివిజన్ పరిధిలోని అన్ని ప్రజాపార్కులలో ఎన్ క్యాప్ పథకం కింద అవసరమైన అన్ని మౌలిక వసతులు, చిన్నపిల్లల క్రీడా పరికరాలు, వ్యాయామ పరికరాలు, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ అభిప్రాయ సేకరణలో అడ్మిన్ సెక్రటరీలు చురుకుగా పాల్గొని సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించి విజయవంతం అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.
డివిజన్ పరిధిలో గతంలో ఫ్లోర్ పాయింట్లుగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసి, నీటితో కడిగి, ముగ్గులతో అలంకరించి, పూల మొక్కలను ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఇదే విషయమై గతంలోనూ పలుమార్లు సూచనలు చేసినప్పటికీ చర్యలు తీసుకోనందుకు కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను సందర్శించి తాగునీటి నాణ్యత ప్రమాణాలను కమిషనర్ పరీక్షించారు. వాటర్ ట్యాంక్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఆదేశించారు.
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ డ్రైనేజీ కనెక్షన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. ప్రధాన డ్రైన్ కాలువలు, స్థానిక పంట కాలువలను భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానించే పనులను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు.
భవన నిర్మాణ సామాగ్రి రోడ్లను ఆక్రమించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అలాగే రోడ్ల మీద అధికారికంగా పార్కింగ్ చేసియున్న వాహనములను గమనించిన కమిషనర్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సహాయముతో వాటిని తొలగించావలసినదిగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నిర్మాణం అనంతరం మిగిలిన వ్యర్ధాలను రోడ్లపై ఉంచరాదని యజమానులకు తెలియజేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా అపార్ట్మెంట్ నిర్మాణం కోసం రోడ్డును ఆక్రమించి చేపట్టిన తాత్కాలిక నిర్మాణాన్ని గమనించిన కమిషనర్, వెంటనే ఆ నిర్మాణాన్ని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
అదేవిధంగా స్థానికంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో ఏర్పాటు చేసిన మ్యాన్ హోల్స్ పై వెంటనే మూతలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి, స్థలాలను శుభ్రపరచుకునేలా హెచ్చరించాలని, అలా చేయని పక్షంలో భారీ జరిమానాలను విధించాలని ఆదేశించారు.
అల్లీపురం డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్న చెత్త సేకరణ ట్రాక్టర్ పైన వ్యర్ధాలను కప్పి ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని గుర్తించి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా సమయంలో తప్పనిసరిగా వాహనాలలోని వ్యర్థాలు కప్పబడి వలలు ఉండేలా తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
చెత్త తరలింపు వాహనాల ట్రిప్పుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, డంపింగ్ యార్డ్ లో అదనపు సిబ్బందిని నియమించుకొని ప్రణాళికబద్ధంగా వ్యర్ధాలను డంపు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
చెత్త సేకరణ వృత్తి దారులను గుర్తించి వారి పిల్లలను సి.డి.పి.ఓ ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో జాయిన్ చేయించాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, డిప్యూటీ కమిషనర్ చే న్నుడు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్,ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్,ఈ.ఈ.శ్రీనివాసరావు,డి.ఈ.ఈ.రఘురాం,ముజాహిద్దీన్, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా, ఏ.సి.పి. ప్రకాష్ , ప్రజాప్రతినిధులు సచివాలయ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.
.